calender_icon.png 10 January, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి..

11-12-2024 11:37:27 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి): వెనక నుంచి అతివేగంగా ఆజాగ్రత్తగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగద్గిరిగుట్ట సోమయ్యనగర్ కు చెందిన సుధాకర్ (30) కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన ద్విచక్ర వాహనంపై మున్సిపాల్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ఐడియల్ చెరువు కట్ట రంగదాముని దేవాలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన TS 16 UB 3250 నెంబర్ గల కారు సుధాకర్ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సుధాకర్ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.