calender_icon.png 22 April, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ... విద్య సాధికారతకు ప్రోత్సాహం

21-04-2025 11:28:16 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సోమవారం సైకిల్లు పంపిణి చేయడం జరిగింది. సూరారం పాఠశాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి నడిచి వస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ను పొదుపు చేసి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సూచనలతో సైకిల్ లను కొనుగోలు చేయడం జరిగింది.

ఈ సందర్భాన్ని ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ వలన విద్యార్థులకు మేలు జరిగిందని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జరుపుల రవీందర్ వెంకటేశ్వర్లు, సతీష్, వెంకటేశ్వర్లు, కవితా, కార్తీక్, మనోహరదేవి, మేరీభాయి, సునీల్, చంద్రమౌళి, నగేష్, గోపికృష్ణ, కవిత, రామన్న, శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.