calender_icon.png 2 February, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీ.. బీబీ నడుమ హస్బెండ్!

01-02-2025 12:00:00 AM

బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీబీ’. ‘లవ్ ట్రయాంగిల్ నహీ హై.. సర్కిల్ హై’ అనే క్యాప్షన్‌తో సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాలో అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో పేరుగాంచిన ముదస్సర్ అజీజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వసు భగ్నానీ, జాకీ భగ్నా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారంలో జోరు పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం విడుదల చేసిన పోస్టర్లు సినీప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ పోస్టర్‌లో భూమి, రకుల్ గుర్రంపై స్వారీ చేస్తుండటం, అర్జున్ కపూర్ చేతులు రెండూ కట్టబడిన ఆసక్తికరమైన ట్విస్ట్‌ను చూపిస్తోంది. సినిమా కథలో సరదా కామిక్ యాంగిల్ ఉండబో తోందని ఈ పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ ఫిబ్రవరి 1 విడుదల చేయనున్నారు. ఈ లవ్ సర్కిల్‌లో చివరకు ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందోట్రైలర్‌లో చూద్దాం!