calender_icon.png 31 October, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిభవ్‌కుమార్ గూండాలా వ్యవహరించాడు!

02-08-2024 01:38:49 AM

కనికరం లేకుండా స్వాతిమాలీవాల్‌పై దాడి చేశాడు

బిభవ్‌కుమార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

బెయిల్ పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ‘ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? సీఎం కార్యాలయంలో ఇలాంటి గుండాలకు ఎలా ప్రవేశం లభించింది? స్వాతి మాలీవాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తున్నా కనికరం లేకుండా దాడి చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భిభవ్‌కుమార్ ఏ అధికారం ఉందని దాడి చేస్తాడు? దాడికి పాల్పడినందుకు సిగ్గుపడాలి’ అని సుప్రీం కోర్టు గురువారం ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజ్యసభ సభ్యురాలు, ఆప్ నేత స్వాతిమాలీవాల్‌పై దాడి చేశాడని బిభవ్‌కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన బెయిల్ కోసం ఢిల్లీ మెజిస్టీరియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బిభవ్‌కుమార్ గుండాలాపై దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బంగ్లాలో ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంపై విస్మయాన్ని వ్యక్తపరిచింది.