ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నిరసన..
అశ్వరావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఒక్కొక్కచోట ఒక్కొక్క కొలత ఆర్ అండ్ బి అధికారులు శనివారం ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోనే జంగారెడ్డిగూడెంలో ఒక కొలత, ఖమ్మం రోడ్ లో మరో కొలత భద్రాచలం రోడ్లు ఒక్కోచోట ఒక్కో కొలత పెట్టి విస్తరణ పనులు చేపడుతున్నారని ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణమంతా ఏ విధమైన కొలతల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రింగ్ రోడ్డు సెంటర్లో కూడా అదే విధంగా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్లు భవనాల శాఖ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తూ పేదల పొట్ట కొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మొగల్పు చెన్నకేశవరావు, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, టిడిపి నాయకులకు కుట్రం స్వామి, టిఆర్ఎస్ నాయకులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సత్యవరపు సంపూర్ణ, జి ప్రభాకర్, సిపిఐ నాయకులు సలీం తదితరులు వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పట్టణమంతా ఒకే మాదిరిగా కొలతలు చేపట్టాలని, కొలతల్లో వ్యత్యాసం ఉండరాదన్నారు. లేనిపక్షంలో నిరసన తేవతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్షులు వలీ పాషా, కార్యదర్శి ఎండి నజీర్, ఆసిఫ్, ఆలీమ్, రఫీ, రహమత్ తదితరులు పాల్గొన్నారు.