calender_icon.png 17 April, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావుకు స్వాగతం పలికిన భువనగిరి నాయకులు

09-04-2025 01:36:14 AM

సిద్దిపేట ఏప్రిల్ 8 విజయ క్రాంతి: మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా స్వాగతం పలికారు.  తుంగతుర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న క్రమంలో భువనగిరి బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని సూచించారు. అనంతరం పార్టీ నాయకులందరూ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లారు.