calender_icon.png 22 January, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరి గణేష్ ఉత్సవ సమితి మండప నిర్వాహకులతో సమావేశం

02-09-2024 06:15:17 PM

భువనగిరి, (విజయక్రాంతి): భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాలతో సమావేశం సోమవారం  భువనగిరి పట్టణంలో ఎస్ఎల్ ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఉత్సవ సమితి సలహాదారులు శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భువనగిరి గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ... ప్రతి ఒక్క గణేష్ మండపం ముందు ప్రజారోహణ కార్యక్రమం ముందుగా పూజ చేసి గణపతి ప్రస్థాపన కార్యక్రమం చేయాలని, అదేవిధంగా నవరాత్రులలో ఒక రోజు కచ్చితంగా గోపూజ మండపాల వద్ద జరగాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి.

ప్రతి ఒక్క గణేష్ మండపాల వద్ద ఉత్సవ సమితి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరిగిన ఉత్సవ కమిటీకి తెలియజేసే ప్రతి విషయంలో స్పందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులతో మాట్లాడతామని కలెక్టర్ నిర్వహించారు. ఫీస్ కమిటీ సమావేశంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్, డిసిపి ప్రతి విషయంలో సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహ చారి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం బోనాలు పట్టణంలో హిందుత్వాన్ని చాటే విధంగా కోనగిరిలో అలంకరణ భక్తిశ్రద్ధలతో 9 నవరాత్రులు ఎంతో క్రమశిక్షణగా ఉండే ఈ భువనగిరిలో ఈ సంవత్సరము కూడా అదే విధంగా ఇంకా ఘనంగా నిర్వహించాలన్నారు. 

కోనగిరిలో భజన పెంపొందించడానికి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు భజన కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం అధికారులతో మాట్లాడి అందరూ భజన చేస్తూ పూజా కార్యక్రమాలు చేయాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంచెం రాజు ,కాలియా నాగరాజు, పట్నం కపిల్, వాస నర్సింగ్, నామోజు రాజు, మహంకాళి, సురేష్, కానుగంటి ప్రేమ్ కుమార్, బెల్లంకొండ చందు, కానుకుంట్ల రమేష్, పోకల రవీందర్, నాగు, నరేష్, అరుంధతి సభ్యులు, ఎస్ఆర్ యూత్ సభ్యులు, సర్దార్ సిద్ధార్థ యూత్ సభ్యులు, వీరాభిమన్యు సభ్యులు, హనుమాన్ యూత్ సభ్యులు, నేతాజీ యువజన సంఘం సభ్యులు, భవాని యూత్ సభ్యులు, వివిధ మండపాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.