calender_icon.png 20 April, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ మార్గ అధ్యక్షులుగా భూసారపు గంగాధర్

20-04-2025 05:03:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్టీఆర్ మార్గ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్(NTR Marg Development and Welfare) సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ప్రియదర్శిని నగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా మారెడ్డి శ్రీనివాస్, గోండ శంకర్ తోడిశెట్టి పరమేశ్వర్ లు ఉన్నారు. మూడవసారి కాలనీ కమిటీ అధ్యక్షులుగా భూసారపు గంగాధర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా శివరాం వెంకటేష్, కోశాధికారిగా చిటిమల సదయ్య ఉపాధ్యక్షులుగా ద్యాగ లక్ష్మీరాజు, జాయింట్ సెక్రెటరీగా సాయినాథ్ లు ఎన్నికయ్యారు.