18-03-2025 12:00:00 AM
మహబూబాబాద్, మార్చి 17: (విజయక్రాంతి) రోడ్డు ప్రమాదంలో భూపతి పేట గ్రామ ఎన్పీడీసీఎల్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పోలపల్లికి చెందిన తండా ఏకాదస్వామి గూడూరు మండలం భూపతిపేటలో కరెం ట్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం శుభకార్యం నిమిత్తం మహబూబాబాద్‌కు వెళ్లి గూడూరుకు వస్తున్న క్రమంలో బొద్దుగొండ గండి తండా 365 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహ నం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆయనకు భార్య సంధ్య ఒక పాప, బాబు ఉన్నట్లు సమాచా రం. యాకస్వామి మృతితో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.