calender_icon.png 23 December, 2024 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

23-12-2024 12:39:29 AM

మహదేవపూర్, డిసెంబర్ 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేటలో అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొని  మాట్లాడుతూ అమిత్ షా  పార్లమెంటులో అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం  మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 19 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్దిదారులకు రూ.4 లక్షల 98 వేల రూపాయల విలువైన చెక్కులను  అందజేశారు. మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాల బ్యాగులను ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.