calender_icon.png 8 January, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్...

07-01-2025 04:33:35 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గల జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్, హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.