మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని చిర్రకుంట గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరైన పౌల్ట్రీ ఫామ్ నిర్మాణానికి మండల అభివృద్ధి అధికారి రాజేశ్వర్ భూమి పూజ నిర్వహించారు. గురువారం గ్రామంలో లబ్దిద్దారురాలు రామటెంకి విజయకు మంజూరైన పౌల్ట్రీ ఫాం ఆమె వ్యవసాయ క్షేత్రంలో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. 3 లక్షల ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ టీఎ లు రాజమల్లు, కుమార్, మాజి సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ శెట్టి సత్యనారాయణలు పాల్గొన్నారు.