చేర్యాల: చేర్యాల మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి జనగాం డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. గుర్జకుంట, దొమ్మాట, ముస్తాల గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. దీంతో ఆయా గ్రామాలను ఆయన సందర్శించి, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం హాయంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి తాను విరివిగా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. అనంతరం ఆయన చేర్యాల పట్టణంలోని రెండో వార్డుకు చెందిన తీగుళ్ల మల్లవ్వకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 60 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మండల పార్టీ అధ్యక్షులు రవి, నాయకులు పుర్మ ఆగమ రెడ్డి, చెవిటి లింగం, బైరగోని భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేశారు.