calender_icon.png 6 February, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు, ఎస్ డబ్ల్యు జి డ్రైనేజీ పైప్ లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ

17-01-2025 04:24:52 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరపాలక సంస్థ చరిత్రలోనే గత ఐదు సంవత్సరాల మా పాలకవర్గంలో నగర వ్యాప్తంగా 200 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేశామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు 34వ డివిజన్ లో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. గోదాంగడ్డలో స్థానిక కార్పోరేటర్ షఖీరా అంజూమ్ బర్కత్ అలీతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 74 లక్షల సాధారణ నిధులతో రెండు చోట్ల సీసీ రోడ్లు, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు. డివిజన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ కు ఘన స్వాగతం పలికి... కార్పోరేటర్ శాలువాతో సత్కరించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... 34 డివిజన్ గోదాంగడ్డలో పూరాతన కాలంలో నిర్మించిన డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో నూతన ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్లు నిర్మాణం చేసి రోడ్లను విస్తరించేందుకు పనులు చేపట్టామని తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో ఇరుకుగా ఉన్న కాలనీల్లో చాలా ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్లు వేసి రోడ్లను విస్తరించడంతో పాటు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీస్కున్నామని తెలిపారు. పైపులైన్ తో డ్రైనేజీ వేయడం ద్వారా కాలనీల్లో ప్రజలకు దోమలు, పందుల బెడద లేకుండ దుర్వాసన రాకుండ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. నగర వ్యాప్తంగా 200 కోట్ల మున్నిపల్ సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేయడం నగరపాలక సంస్థ లో ఒక చరిత్ర అన్నారు.

గతంలో సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేయాలంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. మా పాలకవర్గం లో చాలా ఉదారంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా కార్పోరేటర్ మా దృష్ఠికి తెచ్చిన వెంటనే అక్కడ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.  మా పాలకవర్గ ఆయాంలో  ప్రభుత్వ పెద్దలు, జిల్లా యంత్రాంగం, అధికారుల సహాయంతో కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధి ఏ పాలకవర్గం లో జరగలేదని అన్నారు. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మా పాలకవర్గానికే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఇఫ్రా తహరీన్ అథీనా, డీఈ అయూబ్ ఖాన్, ఏఈ గట్టు స్వామీ, డివిజన్ పెద్దలు ఉయ్యాల శ్రీనివాస్, ఖరీం, హామీద్ తదితరులు పాల్గొన్నారు.