మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. మంగళ వారం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ సమీపంలో ఆలయ నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు, గరిగే సుమన్ ముదిరాజ్, పులిపాక సదానందం ముదిరాజ్ ల ఆద్వర్యంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి అని పట్టణంలో ఆలయ నిర్మాణానికి ముదిరాజ్ కులస్తులు అందరూ ముందుకు రావాలని కోరారు.
కులస్తులు ఏ కార్యక్రమం చేపట్టిన కులస్థూల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని అలాగే అన్ని గ్రామాల్లో పెద్దమ్మ తల్లి ఆలయాలు నిర్మించుకోవాలని, భవిష్యత్ లో ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడులు అధికారికంగా నిర్మించాలని కోరారు.
పెద్దమ్మ గుడులు ఐక్యమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని, జాతి ఐక్యత అభివృద్ది కోసం పాటు పడతాయని అన్నారు. ఈ కార్యక్రమం పట్టణ ముదిరాజ్ కుల పెద్దలు కొమురయ్య, పిల్లి మల్లయ్య, కుందాల ఓదెలు, అంకం రాములు, భీమరి సదానందం, చెప్పాల రమేష్, బండారి కనకయ్య, పిల్లి మల్లేష్, బండారి రమేష్, పూలు కుమార్ స్వామి, పిల్లి శ్రీనివాస్, నెల్లి వీరన్నలు పాల్గొన్నారు.