calender_icon.png 26 December, 2024 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ డబ్ల్యూజీ డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ

08-11-2024 03:23:43 PM

మానకొండూర్ (విజయక్రాంతి): విలీన గ్రామాల డివిజన్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ అభివృద్ధి నేపధ్యంలో శుక్రవారం రోజు నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్ రావు, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ 8వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ సల్ల శారద రవీంధర్ తో కలిసి అలుగునూరులో మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నగరపాలక సంస్థకు చెందిన 29 లక్షల నిధులతో రెండు చోట్ల ఎస్ డబ్యూజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు. చేపట్టిన పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను మేయర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. అలుగునూరు గ్రామం కొత్తగా కరీంనగర్ నగరపాలక సంస్థ లో విలీనమైన గ్రామం కాబట్టి విలీన గ్రామమైన 8వ డివిజన్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

నగరపాలక సంస్థలో విలీనం చెందిన 8 గ్రామాల డివిజన్లకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి.. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి నగరంతో సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే మున్సిపల్ లో అందుబాటులో ఉన్న నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ముఖ్యంగా అలుగునూరు రహాదారిపై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక కార్పోరేటర్ సల్ల శారద రవీంధర్ మా దృష్ఠికి తేవడంతో 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అలుగునూరు చౌరస్తా నుండి మహాత్మానగర్ వరకు సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు సమస్యగా ఉన్న ప్రతి చోట డ్రైనేజీ నిర్మాణం చేస్కోని సీసీ రోడ్లు కూడ వేయడం జరగిందన్నారు. ఇంకా అలుగునూరు ప్రాంత అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభ దశలో ఉన్నాయని అన్నారు.

వాటి పనులు కూడ త్వరలోనే ప్రారంభించి... పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అమృత్ 2.0 పథకంలో త్రాగు నీటి కోసం ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ కాలనీల్లో కొత్త పైపులైన్ వేసి...రిజర్వాయర్ల నిర్మాణం చేసి త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. వాటి పనులను కూడ త్వరలోనే మొదలు పెడుతామని స్పష్టం చేశారు. అలుగునూరు కరీంనగర్ నగరానికి ముఖ ద్వారం కాబట్టి సుంధరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీస్కుంటున్నామని తెలిపారు. అలుగునూరు కరీంనగర్ వంతెనపై రెండు వైపులా చక్కటి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు అంభేడ్కర్ విగ్రహాం హైలాండ్ ను కూడ సుంధరీకరించామని తెలిపారు.

అలుగునూరు నుండి మానకొండూర్ వైపు కూడ గతంలోనే సెంటర్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పటికీ సింగిల్ రోడ్డు కావడంతో ఏర్పాటు చేయలేదన్నారు. ఆర్&బి శాఖ డబుల్ రోడ్డు పూర్తి చేస్తే మానకొండూర్ వరకు సెంటర్ లైటింగ్ ను వేస్తామని తెలిపారు. నగరానికి ముఖ ద్వారాలైన మానకొండూర్, హైదరాబాద్ రెండు రహదారులు వెలుగులతో ఉండేలా చర్యలు తీస్కుంటామని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యత క్రమంలో నగరంతో సమాంతరం అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక వేశామని తెలిపారు. అంతే కాకుండా సీఎం అస్యూరెన్స్ కింద కూడ 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడ పెట్టడం జరగిందని వాటిని కూడ త్వరలోనే ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. అలుగునూరుతో పాటు విలీన గ్రామాలన్నీటిని అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ ఓం ప్రకాష్ డివిజన్ కు చెందిన వివిద పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.