21-04-2025 10:10:19 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన భూక్యా రేణుక జ్యోతిష్యంలో ఆర్యన్ పరిశోధన విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ ను అందుకున్నారు. భూక్య రేణుక భర్త భూక్య కిరణ్ గాంధీ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నీటిపారుదల ఆర్థిక శాఖ అధికారి స్వర్గీయులైన ప్రముఖ భుక్య భోజ్య నాయక్ కోడలు, నాయక్ కాంప్లెక్స్ ఈనెల 20న సింహాచలంలో జరిగిన మెగా జ్యోతిష్య సదస్సులో జ్యోతిష్యంలో ఆర్యన్ పరిశోధనా విశ్వవిధ్యాలయం ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో వ్యవస్తాపకులైన డా.నరసింహ స్వామి చేతుల మీదుగా వివాహ సంతాన అంశంలో పరిశోధన చేసినందుకుగాను డాక్టరేట్ అందుకున్నారు. జ్యోతిష్యంలో ఈమే చేసిన సేవలకు గుర్తింపుగా శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆచార్య బిరుదు చేత సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక కాలంలో మనిషి ఎదురుకొంటున్న సమస్యలకు గ్రహాల కారకత్వాల గురించి జ్యోతిష్య శాస్త్రంలో నిఘూఢమైన విషయాల గురించి అందరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దాని కోసం మరింత సేవా కృషి చేస్తానని పేర్కొన్నారు.