బెల్లంపల్లి, (విజయక్రాంతి): లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బెల్లంపల్లికి చెందిన భుక్య రాములు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాతీయ అధ్యక్షులు తేజవత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్, జాతీయ నాయకులు కోటియా నాయక్, హరి నాయక్ ల సమక్షంలో రాములు నాయక్ కు నియామక పత్రాన్ని అందజేశారు. లంబాడీల జాతి కోసం, హక్కుల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన రాములు నాయక్ స్పష్టం చేశారు.