calender_icon.png 5 March, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డిని కలిసిన భూక్య పద్మ

05-03-2025 12:21:41 AM

 మహబూబాబాద్, మార్చి 4 (విజయ క్రాంతి ): నూతన ఏఐసీసీ ఆదివాసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన భూక్య పద్మ మంగళవారం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సైతం కలిసి ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఉమాను సైతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ చైర్మన్ డాక్టర్ తేజవాత్ బెల్లయ్య నాకు అదే విధంగా ఎమ్మెల్యే మురళి నాయక్ కు జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి కి తనతో పాటు ఉన్న మహిళలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ కొరకు నిత్యం కష్టపడుతూ తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.