చంచల్‌గూడ జైలునుంచి విడుదలైన మాజీ పోలీసు అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చంచల్‌గూడా జైలులో ఉన్న మాజీ అడి నల్ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ ఓఎస్డీ పి.రాధా శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు 10నెలలుగా చం జైలులో ఉన్న వీరు ఇంటి బాటపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు వ్యక్తిగత బాండ్‌తో పాటు పూచీ సమర్పించడంతో శుక్రవా సాయంత్రం వారిని జైలు అధికారులు విడుదల చేశారు.
వీరిద్దరికీ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి, కింది కోర్టులో వారి పాస్‌పోర్టులను అందజేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రూ.లక్ష వ్యక్తిగత బాండుతో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశిం కాగా.. కోర్టు ఆదేశాల ప్రకా వీరు 8వారాల పాటు ప్రతీ సోమవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది.