27-02-2025 02:00:38 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): వారసత్వంగా వచ్చిన భూములతో పాటు కొనుగోలు చేసిన భూములు పట్టాలుగా మారాలంటే రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని గత ప్రభుత్వ విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ పారదర్శకంగా జరిగేందుకు తాసిల్దార్లకు ధరణి పేరుతో రిజిస్టర్ అధికారాలను అప్పగించింది.
అవినీతికి తావు లేకుండా నేరుగా స్లాట్ బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి తావు లేకుండా రిజిస్టర్ చేయాల్సిన తాసిల్దార్ లో ఆ ప్రాంతంలో అధికార పార్టీ లీడర్లుగా వ్యవహరిస్తున్న వారిని బ్రోకర్లుగా నియమించుకొని లిటిగేషన్ పేరుతో ఒక్కో ఎకరానికి రిజిస్టర్ ఖర్చు లక్ష 25 వేలు ధరలు నిర్ణయించి రైతుల నుంచి అప్పనంగా దండుకుంటున్నారు.
నేరుగా అధికారులు చేతులు చాచకుండా అధికార పార్టీ నేతలను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలోని ఓ రైతు నుంచి 4.27 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం అదే గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఆరు లక్షలు వసూలు చేశాడు రిజిస్ట్రేషన్ చేయమని వెంటపడితే కోర్టు కేసులు అంటూ సాకులు చెప్పి ఎకరా 20 గుంటల భూమిని కాజేసేందుకు పన్నాగాని రచించాడు.
చివరికి స్థానిక ప్రజా ప్రతినిదిని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన మహబూబ్ అలీ, హుస్సేన్ షా ఇద్దరు సోదరులకు పూర్వకాలం జమీందారులతో జీతం ఉన్న కారణంగా గ్రామంలోని 696 సర్వే నెంబర్ లోని 6.14 గుంటల భూమిని 3.07 గుంటల చొప్పున ఇచ్చారు. అనంతరం హుస్సేన్ షా వారసులం నుండి మహబూబ్ అలీ వారసులు 34 ఏళ్ల క్రితం 3.07 గుంటల భూమిని కొనుగోలు చేశారు.
మహబూబ్ అలీ వారసులు కాజాషా మనుమలకు చెందాలసిన భూమిని వారి దయాదులు హక్కుదారులుగా చూపుతూ నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును అశ్రాయించగా 1.20 గుంటలు, మరో 3.07 గుంటలు ఇనాం భూమి పెండింగ్ లో ఉంది. కానీ 697/అ లో కొనుగోలు చేసిన 2.15 గుంటలు పట్టా భూమిని ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని రిజిస్ట్రేషన్ కి ఇబ్బందులకు గురి చేయడంతో బాధితురాలు హసీనా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని సంబంధిత మండల తాసిల్దార్ ను ఆదేశించారు.
అనంతరం ఏడాది జనవరి 4న రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేశారు అనంతరం కోర్టు కేసులు లిటిగేషన్ పేర్లతో రైతుల నుంచి డబ్బులు ఆశిస్తూ అదే గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి మధ్యవర్తిత్వంతో ఆరు లక్షల ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపారు అయినప్పటికీ కోర్టు లో ఉన్న మరో ఎకరా 20 గుంటల భూమి ని తమకు రాశి ఇవ్వాలని షరతును విధించారు ఇదేంటని స్థానిక ప్రజాప్రతినిధి ఆశ్ర యించగా విషయం వెలుగులోకి వచ్చింది.
బ్రోకర్ అవతారంలో లీడర్.!
స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పక్కనే ఉంటూ అంతా తాను చెప్పినట్టే నడుస్తుంది. అంటూ బిజినపల్లి మండలంలో పెత్తనం చెలాయిస్తూ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐకెపి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని దొంగిలించి ఓ మిల్లుకు సప్లు చేసిన విషయంలో ప్రజాప్రతినిధులతో చివాట్లు తిన్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా సేకరించిన భూముల్లో ఇసుక తవ్వకాలు జరుపు తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తన వ్యవహార శైలి పట్ల ఈమధ్య మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ కార్యకర్తల నుంచి చివాట్లు తప్పలేదు. ఆయన తన వ్యవహార శైలి పట్ల తీరు మారకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రజా ప్రతినిధికి సదురు నేత తలనొప్పిగా మారాడు.
ఆరు లక్షలు ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేస్తలేరు
మాకు దక్కాల్సిన భూమి రిజిస్ట్రేషన్ చేయాలని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందించలేదు. కోర్టు ఆర్డర్‌ను కూడా పట్టించుకోలేదు. కలెక్ట ర్‌ను ఆశ్రయించినా రిజిస్ట్రేషన్ చేయలేదు. మా గ్రామంలోని మాజీ ప్రజా సర్పంచ్ అమృత్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖర్చు అవుతుందని ఇప్పటిదాకా తన భార్య ఫోన్‌పే ద్వారా 6 లక్షలు వసూలు చేశాడు. అయినా రిజిస్ట్రేషన్ చేయమంటే ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెల్లదీస్తున్నారు.
హసీనా, బాధితురాలు, వట్టెం గ్రామం
అంతా కట్టు కదా...
సర్వే నెంబర్ 697 696 నెంబర్లో గల భూములు ప్రస్తుతం కోర్టు కేసులు పెం డింగ్లో ఉన్నాయి అందుకే రిజిస్ట్రేషన్ చేయలేకపోయినాం. మరో రెండు ఎకరా ల 15 గుంటల పట్టా భూమి విషయంలో గ్రామంలో పంచనామా నిర్వహించాం ప్రస్తుతం విచారణ జరుగుతుంది. బాధితురాల నుంచి డబ్బులు డిమాండ్ చేశామన్న విషయంలో వాస్తవం లేదు.
-శ్రీరాములు, తాసిల్దార్, బిజినపల్లి