calender_icon.png 23 April, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల భూ సమస్యల పరిష్కారానికే భూభారతి పోర్టల్...

22-04-2025 11:26:51 PM

అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా...

బోథ్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమికి సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి, భూమికి సంబంధించిన రికార్డులు ఆన్లైన్ ఆఫ్ లైన్ ఉండటం కోసం ఆర్‌ఓఆర్ చట్టంలో దాదాపు 24 సవరణలు చేసి పారదర్శకంగా భూ భారతి చట్టాన్ని ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం బోథ్ మండలంలోని ధన్నూర్ (బి) గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి అర్హతలు తెలుసుకున్నారు. అంతకుముందు జాతీయ అవార్డు పొందిన కలెక్టర్ ను గ్రామస్తులు సన్మానించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధరణి పోర్టల్ తీర్చని అనేక సమస్యలకు భూభా-రతి చట్టం పరిష్కారం చేస్తుందని, జిల్లా స్థాయిలో సైతం అప్పీల్ కు అవకాశాలు ఉన్నాయని, ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి భూదార్ కార్డులు అందిస్తామని, సాదాబైనామ సమస్యలు, అసైన్డ్ భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరి-స్తామని అన్నారు. గ్రామ పరిపాలన అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, బోథ్ మండల స్పెషల్ ఆఫీసర్ వాజిత్, మండల తహసిల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ విస్తీర్ణ అధికారి, ఏపీవో, ఏపీఎం, గ్రామస్తులు పాల్గొన్నారు.