29-04-2025 09:31:24 PM
ఆర్థిక భరోసా ధాన్యం కొనుగోలు...
అదనపు కలెక్టర్ మోతిలాల్..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం రైతు హక్కుల భరోసా అయితే వరి ధాన్యం కొనుగోలు ఆర్థిక భరోసా అని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) అన్నారు. మంగళవారం ఆయన రైతులతో మాట్లాడుతూ.. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కోసం 332 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా ఇప్పటి వరకు121 కేంద్రాల ద్వారా 21,143 టన్నుల ధాన్యం 2,395 రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. హిందువుగాను రైతుల అకౌంట్లలో 5.73 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న ప్యాడి క్లీనర్లు, తేమ పరికరాలు, హస్క్ రిమూవర్లు తదితర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.