calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి

19-04-2025 12:57:38 AM

మెదక్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): ప్రజలకు చెందిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూ భారతి చట్టం అమలులోకి వచ్చిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషా రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ ) ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షల పై గా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు.

ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పు డు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు.

భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అ క్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకునే అవకాశం భూ భారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూ భారతి పోర్టల్ లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించారు.