- సత్వర అమలుకు కసరత్తు
- అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు
- 26న 4 సంక్షేమ పథకాలు
- త్వరలో ప్రెస్ అకాడమీ, జర్నలిస్టు యూనియన్లతో భేటీ
- మంత్రి పొంగులేటి వెల్లడి
ఖమ్మం, జనవరి 11 (విజయక్రాంతి): ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఫిబ్ర వరి ౨౦ నుంచి ౨౮వ తేదీ మధ్యలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేశామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.
చట్టాన్ని గవర్నర్ ఆమోదించారని, చట్టంలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపా రు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్‌లో శనివారం మీడియా సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి మంత్రి వివరించారు. పకడ్బందీగా, పక్కాగా అమలయ్యే చట్టంలా భూభారతి నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఎలాంటి లొసుగులు లేకుండా పక్కా రూల్స్ రూపొందించామని, కీలకమైన ల్యాండ్ అప్పీల్ అథారిటీని ఏర్పాటుచేశామని తెలిపారు. రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఉద్ఘాటించారు. సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
భూభారతిలో ఉన్న అనుభవదారు కాలం వల్ల పట్టాదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారి హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా ఇచ్చారు.
పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం
పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యమని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయని మంత్రి పేర్కొన్నా రు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదో డి కళ్లల్లో ఆనందం చూసేందుకు గణతంగ్ర దినోత్సవం రోజు నాలుగు పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జారీ పథకాలను ప్రారంభిస్తున్న ట్టు తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి, ఈ పథకాలపై చర్చిం చి, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వివరాలను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. వ్యవసాయం యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఎకరాకు రూ.12 వేలను అందజేస్తామని స్పష్టంచేశారు.
రెండు విడతల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే ఇందిర మ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రెండు విడతల్లో అమలు చేయనున్నట్టు పొంగులేటి తెలిపారు. ఒక్కో విడతకు రూ.6 వేలు చొప్పున కూలీలకు సాయం అందజేయనున్నట్టు ప్రకటించారు. 2023-24 సంవ త్సరానికి ఉపాధిహామీ పథకం కింద కనీ సం 20 రోజుల పనిచేసిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప జేస్తామని చెప్పారు. కేవలం భూమి లేని రైతు కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
అర్హులందరికీ ఇండ్లు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పొంగులేటి తెలిపారు. నియోజ వర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 80.60 లక్షల మంది పథకానికి అర్హులుగా నిర్ధారించామని వెల్లడించారు.
ఇప్పటి వరకు 72 లక్షల మందిని యాప్ ద్వారా సర్వే చేశామ ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అదనంగా ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. తన నియోజవకవర్గమైన పాలేరు పరిధిలోని కూసుమంచిలో మాడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు.
జర్నలిస్టుల సమస్యలపై త్వరలో భేటీ
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, ఇతర సమస్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి సమాధానం చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అతి త్వరలోనే యూనియన్ నేతలు, ప్రెస్ అకాడమీ పెద్దలతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.
జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ సమస్యలపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తాను దానిపై బహిరంగంగా మాట్లాడలేనని స్పష్టంచేశారు.
ఎన్ని లక్షల కార్డులైనా ఇస్తాం..
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు మంజూరు చేస్తామని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనికి కూడా జనవరి 26 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలు జరిగినప్పుడే కొన్ని రేషన్ కార్డు లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ కార్డులు ఇస్తుందన్నారు.
ఎన్ని లక్షల రేషన్ కార్డులైనా ఇచ్చేందుకు ప్రభు త్వం ముందుకుపోతుందన్నారు. ఈ నెల 15 లోగా అన్ని జిల్లాల్లో ఇంచార్జి మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు తులం బంగారం వంటి ఇతర హామీల సంగతేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే అమలుచేస్తామని తెలిపారు.
గ్రామాల్లో రెవె న్యూ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పా రు. గత ప్రభుత్వం 59 జీవో ద్వారా గులాబీ నాయకులు కాజేసిన భూములను తిరిగి తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. బీఆర్‌ఎస్ నాయకుల బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పా రు. ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టంచేశౠరు.