calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి

19-04-2025 08:35:16 PM

కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడి...

కాటారం (విజయక్రాంతి): భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూ భారతి చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి  (భూమి హక్కుల రికార్డు చట్టం)  2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పనలో ప్రజలు అడిగిన సమస్యలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని అన్నారు. 

రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి నిపుణుల క్షమిటితో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ప్రత్యేకించి రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని కానీ భూ భారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు సులభంగా. పరిష్కరించడానికి అవకాశం ఉందని తెలిపారు. భూ సమస్యలపై రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తారని తెలిపారు. ధరణిలో అప్పీలు చేయడానికి అవకాశం. లేదని సివిల్ కోర్ట్ కు వెళ్లాలని కానీ  భూ భారతి చట్టంలో తహశీల్దార్ నుండి ఆర్డిఓ, ఆర్డీఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి ల్యాండ్ ట్రిబ్యునల్ నకు వెళ్లాడానికి అవకాశం కల్పించారని అన్నారు.

ప్రతి ఏడాది  భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను నవనీకరణ చేస్తారని తెలిపారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్ లోని రికార్డులు ఆధారంగా బ్యాంకర్లు రుణాలు ఇస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగిఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ప్రభుత్వ పరంగస్ ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ చట్టంతో భూములకు హక్కులు, పట్టాదారు.పాసు పుస్తకాలు అందచేస్తామని, భూమి వివరాలను కూడా మ్యాపులోపొందుపరచడం జరుగుతుందని తెలిపారు.   

ధరణి నుంచి కొత్త పోర్టల్ భూ భారతికి మారుతున్నందున రెవెన్యూ అధికారులు సమగ్రమైన, స్పష్టమైన అవగహన కలిగి ఉండాలని ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లడానికి పైలెట్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 4 మండ లాలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. వచ్చే నెలలో మన జిల్లాలోఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఈ చట్టాన్ని. పటిష్టంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని, అందరం కలిసి ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.  జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై చట్టం పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 

భూ వివాదాల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతో ఉపయోగపడు తుందని రైతులు అవగహన కలిగి ఉండాలని, ఏదేని సహాయతకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. గతంలో ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డులాగే భూధార్ కార్డు జారీ చేస్తామన్నారు. గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని, ఇప్పుడు రెండెంచల అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూ భారతి పోర్టల్ ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు.

భూమి హక్కుల రికార్డు నిర్వహణతో ఎవరు భూమికి యజమానో స్పష్టత వస్తుందన్నారు. భూమి హక్కుల రికార్డులు భూ భారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూ భారతిలో ఉన్న ఫారంలో దరఖాస్తుకు పది రూపాయల ఫీజు చెల్లిస్తే  తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన సందేహాలు, సమస్యలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,  సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్ గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.