25-04-2025 02:27:24 AM
తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 24: భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.గురువారం తుంగతుర్తి, జాజిరెడ్డి గూడెం మండల కేంద్రల్లో భూభారతి 2025 చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ నూతన చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని,భూభారతి చట్టం రైతుల చట్టమని,ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డులాగా ప్రతి రైతు భూమికి భూదాన్ కార్డును ప్రభుత్వం జారీ చేయనున్నట్లు చెప్పారు.
భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి,ప్రభుత్వ భూదాన్,అసైన్డ్,దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్‌ఏకి అధికారాలు ఉంటాయన్నారు.ప్రభుత్వం ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించనుండడంతో రైతులకు గ్రామంలోనే అన్ని సేవలు అందుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు,తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపీడీఓ గోపి,మండల వ్యవసాయ అధికారి గణేష్,మండల వైద్యాధికారి నగేష్ నాయక్, రెవిన్యూ అధికారులు వెంకట్ రెడ్డి,జలంధర్ రావు, ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు ఇందుర్తి వెంకటరెడ్డి,గుడిపల్లి మధుకర్ రెడ్డి,జీడి వీరస్వామి,బైరబోయిన సైదులు,మహారాజు,కొర్రపిడత అవిలయ్య,వివిధ శాఖల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.