calender_icon.png 30 April, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ వివాదాల పరిష్కారానికి భూభారతి

30-04-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని అందకూరు కుబీర్ మండల కేంద్రంలో మ  మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అధికారులు రైతులకు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్దీకరణకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టా న్ని తీసుకువచ్చిందని తెలిపారు.

మే 1 నుండి అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు హాజరై రైతు సదస్సులు నిర్వహిస్తార ని, రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు అవకాశం కూడా ఉందని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీవోలు విచారణ జరిపి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని, ఏవైనా అభ్యంతరాలుంటే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

దీనికోసం రెండంచెల అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తామని చెప్పారు. ప్రతి భూమికి ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ కేటాయించి, స్పష్టమైన హద్దులు, భూ పటాలతో కూడిన పట్టా పాస్బుక్కులు జారీ చేస్తామని తెలిపారు. భూ హక్కుల రికార్డులు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.

ధరణి అమ లుతో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణలో వచ్చిన అంతరాన్ని భూభారతి పూడ్చిపెట్టిందని, ఇకపై ప్రతిసారి మ్యుటేషన్ జరిగినపుడే గ్రామ లెక్కల్లో మార్పులు ఆన్ లైన్ లో నమోదు కానున్నాయని వివరించారు. ఈ చట్టం అమలుతో వారసత్వ భూముల బదలాయింపు, పట్టాదార్ పాస్ పుస్తకాల మార్పిడి, పట్టాలలో తప్పుల సవరణ వంటి సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రజలు తమ వివిధ భూ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. తహసీల్దార్ పరిధిలో పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడిక క్కడే విచారించి పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో లింబాద్రి, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.