26-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 25( విజయ క్రాంతి) : ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసు కురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో భూభారతి చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు.
గత ప్ర భుత్వం ధరణి అమలు చేసినప్పటికీ భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ అధికారులకు ఆంక్షలు విధించడం వల్ల అవి పరిష్కారం కాలేక కార్యాలయం చుట్టూ తిరిగారని ఈ కొత్త చట్టం వల్ల వాటికి పరిష్కారం చూపుతామన్నారు. భూభారతిలో పరిష్కరించే సమస్యలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని త్వరలో రైతులకు ఖాతా నంబర్లు కూడా అందించే విధం గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.
అనంతరం మలేరి యా వ్యాధి నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించి జిల్లాలో వ్యాధులు సంక్రమిం చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డీ వో రత్న కళ్యాణి రైతులు పాల్గొన్నారు.