29-04-2025 05:57:38 PM
ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రైతులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod Venkataswamy) అన్నారు. వేమనపల్లి మండలం నీల్వాయిలో రైతు వేదికలో మంగళవారం తెలంగాణ భూభారతి చట్టం భూ హక్కుల రికార్డ్ 2025 పై అవగాహన సదస్సు ను ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ సభావాత్ మోతిలాల్ కలిసి ఈ సదస్సులో మాట్లాడారు. భూభారతి చట్టంపై రైతులకు మేలు జరుగుతుందని పెండింగ్లో ఉన్న సాదాభాయ్ నామతో పాటుగా అన్ని రకాల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు.
భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ ఓ ఆర్ చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందఅన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారతీయ నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యలు పరిష్కారానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. భూమి ఒక రైతు జీవితానికి చాలా పెద్ద ఆధారమని ముఖ్యంగా భూభారత చట్టంలో అప్పీలు వ్యవస్థ చాలా కీలకమైందని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే అప్పీలు చేసుకోవడం ద్వారా న్యాయాన్ని పొందవచ్చన్నారు.
గ్రామాలలో చాలావరకు భూమి హక్కుల గొడవలు ఉంటాయని కానీ భారతిలో రీ సర్వే కొనుగోలు పాలు పంపకాల దాన దస్తవేదులు విరాసతపట్ట మార్పిడికి తప్పనిసరిగా కమాతం జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి లబ్ధిదారులకు 19 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ , వేమనపల్లి తహసిల్దార్ రమేష్ ,ఎంపీడీవో కుమారస్వామి, మాజీ జెడ్పిటీసీ రుద్రభట్ల సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు సయ్యద్ సాబీర్ అలీ, అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.