calender_icon.png 30 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టం సామాన్యులకు ఆయుధం

30-04-2025 12:00:00 AM

మోతే, ఏప్రిల్28:-  భూభారతి చట్టం సామాన్య రైతులకు ఆయుధం లాంటిదని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హల్ లో ఇన్చార్జి తహసీల్దార్  శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన భూభారతి చట్టం రైతులకు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాజాత ప్రదర్శనతో చట్టం పై అవగాహనతో పాటు లోపాలను సవరించుకోవడం వంటి అంశాలను అధ్యయనం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఏసమస్యలు అన్న స్థానిక తహసీల్దార్ కు మరియు డివిజనల్ అధికారికి పిర్యాదు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఆదేశాల అనుసారంగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాలకూర్తి శ్రీకాంత్, గడ్డంఉదయ్, పల్లెల రాము, పాక ఉపేందర్, మాగి శంకర్, గంట భిక్షపతి, వేముల శ్రవణ్, కాటినాగరాజు, మేడిపల్లి వేణు, కుంద మల్లనాగలక్ష్మి, గజ్జి మంజుల, ఒంటెపాక ప్రియాంక, మేడి ప్రియదర్శిని, పోతరాజు శిరీష, నెమ్మది స్రవంతి, మేడి ఇంద్రజ, తదితరులు పాల్గొన్నారు.