calender_icon.png 7 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో భూములకు భూఆధార్

24-07-2024 12:41:58 AM

  • భూసంస్కరణల్లో భాగంగా నిర్ణయం 
  • గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్ల కేటాయింపు 
  • 25 వేల గ్రామాలకు రోడ్ల నిర్మాణం

న్యూఢిల్లీ, జూలై 23: గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నాలుగో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దశంలో 25 వేల గ్రామాలకు కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నంలో ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో భూసంస్కరణలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. 

గ్రామాల్లో భూ

భూసంస్కరణల్లో భాగంగా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూ కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. భూసంస్కరణలు తీసుకొచ్చే రాష్ట్రాలతో కలిపి కేంద్రం పనిచేస్తుందని సీతారామన్ తెలిపారు. రానున్న మూడేళ్లలో వీటిని పూర్తి చేసేందుకు వీలుగా అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుందని, భూపరిపాలన, ప్రణాళిక నిర్వహణ రాష్ట్రాలు నెరవేర్చాలని సూచించారు. గ్రామాల్లో అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఎల్‌పీఐఎన్) లేదా భూ ఆధార్ నంబర్‌ను కేటాయిస్తామని తెలిపారు. భూమి మ్యాపులను డిజిటలైజేషన్ చేయడం, ప్రస్తుత యజమానులకు అనుగుణంగా మ్యాపులను సబ్ డివిజన్లుగా విభజించడం, భూరికార్డులను రూపొందించిం సంబంధిత రైతులకు వాటిని అనుసంధానించడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. 

పట్టణాల్లో ఇలా.. 

పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్లానింగ్, ఉపచట్టాల రూపకల్పన బాధ్యతలను ఈ మూడేళ్లలో నెరవేర్చాలని నిర్మల స్పష్టం చేశారు. ఈ విషయంలోనూ కేంద్రం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పట్టణ భూరికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. గ్రామాలు, పట్టణాల్లో తీసుకొచ్చే సంస్కరణలు అమలు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, ఏకాభిప్రాయం అత్యంత అవసరమని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. సమాఖ్య వాదాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాలకు అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను పెద్ద మొత్తం కేటాయించాలని ఆమె ప్రతిపాదించారు.