29-04-2025 12:00:00 AM
కొత్త పోర్టల్‌తో భూ సమస్యలకు చెక్: ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
రాజాపూర్ ఏప్రిల్ 28: ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ తో రైతులకు ఎంతో మేలు జరుతుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలోని జేకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్‌ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు,
ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్ను రూపొందించినట్టు తెలిపారు. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రైసింగ్ లోగోలు, ప్రతి మాడ్యుల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారన్నారు. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద భూభారతి పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు , తసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ తసిల్దార్ భారతి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ అశ్విని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్, యాదయ్య, శ్రీను నాయక్, గోవర్ధన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.