calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలు పరిష్కారానికి భూ భారతి

18-04-2025 01:52:54 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్,ఏప్రిల్ 17: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ డివిజన్ పరిధిలోని గరిడేపల్లి మండల కేంద్రంలోని రామకోటయ్య పంక్షన్ హాల్ లో  భూ భారతి చట్టం 2025  పై  అవగాహన సదస్సు కార్యక్రమం లో జిల్లా ఎస్పి  నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూ భారతి చట్టం అమలులోనికి తీసుకొని రావటం జరిగిందని తదుపరి రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయి లో రెవిన్యూ సిబ్బందికి అవగాహన కల్పించటం జరిగిందని ఇప్పుడు మండల స్థాయి లో  ప్రజలకి చట్టం పై అవగాహన తెచ్చేందుకు 23 మండలాలలో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో అవగాహన సదస్సు లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.     

జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ప్రజలకి గ్రామ స్థాయి లో అవగాహన కల్పించేందుకు సదస్సు లు నిర్వహించటం జరుగుతుందని భూ పరిపాలనలో సమస్యలుపరిష్కరించేందుకు సమగ్రమైన చట్టం రూపొందించటం చాలా అద్భుతం అని తెలిపారు. ఈ సమావేశం లో ఆర్ డి ఓ  శ్రీనివాసులు,తహసీల్దార్లు కవిత, నాగార్జున రెడ్డి, సైదులు, కమలాకర్, మంగా, జ్యోతి, సురేందర్ రెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్లు సత్యనారాయణ, సుధాకర్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.