calender_icon.png 29 December, 2024 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1 నుంచి భూ భారతి సేవలు

29-12-2024 03:38:32 AM

పోర్టల్ బాధ్యతలు నిర్వహించనున్న ఎన్‌ఐసీ

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కు కాలం చెల్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ పేరుతో తీసుకొచ్చిన నూతన ఆర్వోఆర్ చట్టం-2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో ధరణి స్థానంలో ‘భూ భారతి’ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే ధరణి నిర్వహణను ప్రభుత్వం ఎన్‌ఐసీకి అప్పగించింది. ఇదే సమయంలో నాటి బీఆర్‌ఎస్ సర్కారు ధరణి పోర్టల్ నిర్వహణను ‘టెర్రాసిస్’ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ గడువు ఈ నెల 31తో ముగియనుంది. కాగా, జనవరి 1 నుంచి ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) నిర్వహించనుంది.