18-04-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, ఏప్రిల్ 17: భూ సమస్యలను పరిష్కరించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండేందుకే చరిత్రాత్మక భూభార తి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సుకు హాజ రై మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి చట్టంతో ఒకేరోజు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు సంబంధిత భూమి సర్వే చేసి మ్యా ప్ తయారు చేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేస్తారని తద్వారా నెలల తరబడి మ్యుటేషన్ కోసం తిరగడం, ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండదన్నారు.
రికార్డు ల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదా బైనామా ద్వారా కూడా దింట్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డిఓ శ్రీనివాసులు, తాహసీల్దార్ దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ ఎండీ ఆరిఫ్, జిల్లా ఆర్‌టిఏ మెంబెర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి పాల్గొన్నారు.