calender_icon.png 28 April, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కరానికే భూ భారతి

28-04-2025 01:23:49 AM

  1. అన్ని మండలాల్లో ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సులు

తహసీల్దార్ స్థాయిలోనే 80% సమస్యలు పరిష్కారం 

కలెక్టర్ రాజర్షి షా

ఇచ్చోడ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): భూ సమస్యల సత్వర పరిష్కరాం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భార తి చట్టాన్ని తీసుకువచ్చిందని  జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం భూ భారతి చట్టంపై ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన అవగాహన సదస్సులో  డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సదస్సులో పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్, పోర్టల్ ద్వారా చట్టంలో ఉన్నవాటిపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు వారి వారి సమస్యలను కలెక్టర్‌కు విన్నవించగా పరిష్కా ర దిశగా పలు సూచనలు సలహాలు చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేది నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో ని అన్ని మండలాల్లో కొత్త చట్టం భూ భారతి అమలుపై ప్రజలకు, రైతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పించడం జరు గుతుందన్నారు. కొత్త చట్టంపై అందరికీ ఆవగాహన ఉండాలని, అధికారులు అవగాహన కల్పిస్తున్న దానిపై రైతులు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.

పేద ప్రజలు ముఖ్యంగా రైతుల కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. సాదా బైనామా సమస్యలను పకడ్బందీగా పరిష్కరిస్తామని చెప్పారు.

భూ భారతి పోర్టల్  జూన్ 2 నుం చి  అమలులోకి వస్తుందని, భూ భారతిలో రికార్డులను సవరణ చేసే అవకాశం ఉందని, గతంలో ధరణిలో రికార్డులను సవరించేందుకు సీసీఐఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం తహసీల్దార్‌తోనే 80 శాతం భూ సమస్యలకు పరిష్కార వెసులుబాటు ఉందన్నారు.  మండలంలోని పోడు భూములు, ఇతర భూముల సమస్య పరిష్కారానికి జులై లో  సర్వే నిర్వహిస్తామన్నారు.  

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మల దేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, మార్కెట్ కమి టీ చైర్మన్ సత్యవతి కోటేష్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ లక్ష్మణ్, మండల నాయకులు రైతులు పాల్గొన్నారు.