calender_icon.png 23 April, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా ‘భూభారతి’

23-04-2025 12:00:00 AM

  1. పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం 
  2. పైలట్ ప్రాజెక్ట్‌గా మండలానికి ఒక గ్రామం ఎంపిక 
  3. రాష్ట్ర రెవెన్యూశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 

సదస్సుకు ముఖ్య అతిథి గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ముందుగా భూ భారతి చట్టంపై కలెక్టర్ హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేసి చట్టంలోని అంశాలను సమగ్రంగా వివరించారు.

మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచేందుకు రాష్ట్రంలోని హైదరాబాద్ మినహాయించి మిగిలిన 32 జిల్లాల్లోని 4జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని, ఆయా జిల్లాలలో జిల్లాకు ఒక మం డలం ఎంపిక చేసి భూభారతి చట్టం అమలుచేస్తున్నామన్నారు. 2025, మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలోనూ జిల్లాకు ఒక మండలం ఎంపిక చేసి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు పరుస్తామన్నారు.

గతంలో సాదాబైనామా ధరణిలో అవకాశం లేకపోవడంతో కోర్టు కూడా ఏమి చేయలేకపోయిందని అన్నారు. ధరణి కింద స్వీకరించిన పరిష్కారం కాని 9.26 లక్షల దరఖాస్తులను భూభారతిలో పరిష్కరిస్తామన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ రెవెన్యూ, ఫారెస్ట్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములపై పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చునని, ఆక్రమించిన వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్ కార్యాలయాల నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజా ప్రతినిధులు కోరిక మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూ రు చేస్తామన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. చట్టం అమ లు పరిచేందుకు తహసీల్దార్లు రెవె న్యూ సిబ్బందితో గ్రామాలకు వస్తారని, దరఖాస్తు స్వీకరించడమే కాకుం డా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని, లేని పక్షంలో ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చునని, అప్పటికీ పరిష్కారం కాకపోతే కలెక్టర్ ను కలవాల్సి ఉం టుందన్నారు.

అనంతరం మంత్రికి శాలువా కప్పి చిత్రపటాలను అందించి సత్కరించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేజ్ చిస్తీ, భువనగిరి మార్కె ట్ చైర్మన్ రేఖ బాబురావు, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా నాయక్, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.