18-04-2025 12:16:51 AM
* సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం
* వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 17 ( విజయక్రాంతి ) :ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో, అదే మాదిరిగా భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో ’భూ భారతి’ భూమి హక్కుల రికార్డు - 2025 చట్టం గురించి, అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు భూభారతి చట్టంలోని ముఖ్యంశాలను రైతులకు వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో, అదే మాదిరిగా భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధా ర్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలోని రైతు లు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు, సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం - 2025 ను రూపొం దించి అమలులోకి తెచ్చిందని చెప్పారు. గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు.అదేవిధంగా భూముల సక్సేషన్ విషయంలో 30 రోజుల గడువు పెట్టి వేగంగా పరిష్కారం అయ్యే విధంగా వెసులుబాటు కలగనుందన్నారు. భూ భారతి చట్టం- 2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రే షన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు.
సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దమందడి మండల కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి స్వప్న అనే దళితకుటుంబానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటిని సందర్శించి, వారి ఇంట్లోనే ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.