18-04-2025 12:59:40 AM
రామాయంపేట, ఏప్రిల్ 17 :రామాయంపేట మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సు శుక్రవారం నాడు రైతు వేదిక నందు నిర్వహిస్తున్నట్లు మండల తహసీల్దార్ రజనికుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిందన్నారు.
అందులో భాగంగా ప్రభుత్వం నూతనంగా ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. రైతుల భూమి హక్కుల భద్రతతో పాటు సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రాత్మక మార్పు తీసుకురావడం కోసం ఈ భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారని తెలిపారు.