29-04-2025 10:09:01 PM
ఎమ్మెల్యే పాయం...
భూ భారతి చట్టం అవగాహన సదస్సు...
పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్..
బూర్గంపాడు (విజయక్రాంతి): భూభారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం వంటిదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(Pinapaka MLA Payam Venkateswarlu) అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై రైతులకు పలు అంశాలు జిల్లా కలెక్టర్ వివరించారు. భూ భారతి ద్వారా రైతుల భూములు సర్వే చేయించి హద్దులు నిర్ణయించి మ్యాపులతో సహా రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తారన్నారు.
దీని వల్ల భూములు కబ్జా చేయడానికి అవకాశం ఉండదని రైతులు తమ భూములను ఆన్ లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందని, గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని భూభారతితో 90 శాతం తహశీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని తెలిపారు. లేదంటే ఆర్డీవో, కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పరచుకోవాలన్నారు. దీనిని వూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీవో దామోదర్, అగ్రికల్చర్ ఏడిఓ తాతారావు, ప్రభుత్వ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యూవజన నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.