calender_icon.png 29 April, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షట్ పల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు

29-04-2025 02:38:23 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా షట్ పల్లిలో భూభారతి చట్టంపై రాష్ట్రం రెవెన్యూ సదస్సు నిర్వహించింది.  భూభారతి అవగాహ సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. భూభారతి చట్టం రూల్ మోడల్ గా ఉండాలని, ప్రజలు ఇచ్చిన సలహాలు స్వీకరించామన్నారు. కలెక్టర్లు, రైతులతో చర్చించి భూ భారతి చట్టం తీసుకువచ్చామని, రైతులకు ఉన్న భూమి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అందుకోసం నాలుగు ప్రాంతాల్లోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్నామని, పేదవాడి కష్టాలు తీర్చాలని ఈ ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.