calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టంతో ప్రజలకు మేలు

19-04-2025 02:10:54 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 ( విజ యక్రాంతి):  భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులు ప్రజలకు ఎంతో మేలు జరగనున్నదని  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి లో  భూదాన జయంతి వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆచార్య వినోబా భావే, ప్రథమ భూదాత  వె ధిరే రామచంద్రారెడ్డి కాoస్య  విగ్రహాలకు  పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టన్ సంయుక్త  ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి భూదాన భూముల పరిష్కారాలపై అవగాహన సదస్సు నిర్వహించారు . 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఎకరాల భూదానంతోనే  ప్రపంచ ద్రుష్టి ని ఆకర్షించిందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు  ఇంటింటికి తీసుకెళ్లడంలో ఇందిరమ్మ ఆశయం వినోభా లక్ష్యం ఒదిగి ఉన్నాయని అన్నారు . భూదానోద్యమం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని  అన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరాంరెడ్డి మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి సర్కార్ రైతు సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తుందని  అన్నారు. రైతుల సంక్షేమం కోసం భూభారతి చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని  తెలిపారు. ధరణి లో సమస్యలు ప్రజల్లో ఒక రకమైన భయాందోళనకు గురి చేసిందని   అన్నారు.

భూదాన ఉద్యమాలకు పునాది పోచంపల్లి అని , ప్రపంచ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అని  కొనియాడారు . అనంతరం జై భీమ్ జై బాబు జై సంవిధాన్ పాదయాత్రను పోచంపల్లిలో పాదయాత్ర నిర్వహించారు . వినోబా మందిరం నుండి పాదయాత్రగా బయలుదేరి మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘన నివాళులర్పించారు.  రాజ్యాంగ విలువలో పై ప్రజలకు అవగాహన పెంచడమే కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగ  దొ క్కలని చూస్తుందని  పేర్కొన్నారు.

పోచంపల్లి పెద్ద చెరువు కట్టపై  మినీ ట్యాంక్ బండ్  నిర్మాణానికి 9.50 కోట్ల నిధులతో చేపట్టి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి , రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి , భూభారతి సభ్యులు  సునీల్ కుమార్, కల్పనా ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ తడక  యాదగిరి, గాంధీ గ్లోబల్   ఫ్యామిలీ చైర్మన్  గున్న రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేష్, తడక రమేష్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భారత లవ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ , జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి , కొట్టం కరుణాకర్ రెడ్డి ,  నాయకులు సీత శ్రీరాములు, ఏలే బిక్షపతి, కొయ్యడ నరసింహ గౌడ్ , పట్నం కృష్ణకుమార్ , ఫకీరు నర్సిరెడ్డి , వేషాల మురళి,  గ్లోబల్ సాహితీ అధ్యక్షులు కే గోపాల్ , గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మహిళా కన్వీనర్ వెన్ రెడ్డి సంధ్య , రైతు విభాగం కన్వీనర్ పావని రెడ్డి , యువజన విభాగం ప్రతినిధులు  హరిదీప్ రెడ్డి , సుభాష్, గ్రామ నిర్మాతల విభాగం కన్వీనర్ గోవర్ధన్ , గాంధీ గ్లోబల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.