calender_icon.png 12 January, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూత్ బంగ్లాలోకి..

11-01-2025 12:00:00 AM

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘భూత్ బంగ్లా’. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత అక్షయ్, ప్రియదర్శన్ కాంబోలో మరో సినిమా తెరకెక్కుతోంది. బాలాజీ టెలీ ఫిల్మ్స్ లిమిటెడ్‌పై ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే వామికా శుక్రవారం ఈ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వామికా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘భూత్ బంగ్లా’ చిత్రం 2006 ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.