రూ.63 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల ప్రారంభం
కరీంనగర్ సిటీ, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా ఆదివారం 20వ డివిజన్ పర్యటించారు. ఆరెపల్లి ఆర్టీసీ కాలనీలో కార్పోరేటర్తుల రాజేశ్వరి బాలయ్యలతో కలిసి 63 లక్షల రూపాయల నిధులతో రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆరెపల్లిలో అభివృద్ధి పనులు సీఎం అస్యూరెన్స్ లో 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు.