calender_icon.png 9 April, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంజనేయ స్వామి ఆలయంలో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

05-04-2025 10:01:37 PM

రెండు లక్షల ఆర్థిక సహాయం

భూమి పూజ చేసిన పైడి ఎల్లారెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనవంతూ సహాయముగా 2,00,000 (రెండు లక్షల) రూపాయలు షెడ్డు నిర్మాణానికి అందిస్తానని హామీ ఇచ్చారు. షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయనను  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఆంజనేయస్వామి ఆలయం ఎదుట షెడ్యూనిర్మానాన్ని చేపట్టేందుకు అడిగిన వెంటనే ఆర్థిక సాయం అందజేస్తానని  పైడి ఎల్లారెడ్డి ముందుకు రావడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.  గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పైడి జనార్ధన్, విండో చైర్మన్ సదాశివరెడ్డి, సంకరి రాజలింగం, ఆకుల విట్టల్, గంపల రామకృష్ణ, ఆకుల శివదినం, మొగుళ్ల ఉమాకాంత్ గౌడ్, గంగసాని సాగర్ రెడ్డి, వాదుల ప్రవీణ్ రెడ్డి, ఆంజనేయులు, చక్రం గౌడ్, బిజెపి నాయకులు సంకరి విట్టల్ తదితరులు పాల్గొన్నారు.