calender_icon.png 21 February, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజ

19-02-2025 08:06:29 PM

మందమర్రి (విజయక్రాంతి): ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ సమీపంలో బుధవారం నూతన ఆలయ నిర్మాణం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం ముదిరాజ్ సోదరుల చిరకాల కోరిక అని, ఆలయ నిర్మాణం త్వరలోనే  పూర్తయి కులస్తుల చిరకాల వాంఛ నెరవేరుతుందని వారు ఆశా భావం వ్యక్తం చేశారు. అలయ నిర్మాణ కార్యక్రమంలో ముదిరాజ్ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నెల్లి రాజలింగు, ఆలయ కమిటీ అధ్యక్షులు మంచిర్యాల జిల్లా యూత్ అధ్యక్షులు గరిగె సుమన్, గౌరవ అధ్యక్షులు సంకేపల్లి ప్రభాకర్, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కట్ల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు పిల్లి మల్లయ్య, అంకం కొమురయ్య, ఉపాధ్యక్షులు అంకం రాములు, పోలు సంపత్, కందుల ఓదెలు, కట్ల తిరుపతి, కనకట్ల స్వామి, కోశాధికారులు భీమరి సదానందం, పిల్లి మల్లేష్, సహాయ కార్యదర్శులు గోగుల లక్ష్మణ్, పోలు కుమారస్వామి, కోళ్ల వెంకట్, ప్రచార కార్యదర్శులు బండారి రాజు, గణవేని స్వామి, నీలి తిరుపతి, పోలు కార్తీక్, గరగంటి కొమురయ్య, లీగల్ అడ్వైజర్ దాసరపు రాజులు పాల్గొన్నారు.