calender_icon.png 9 March, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

07-03-2025 01:11:45 AM

అశ్వరావుపేట మార్చి 6 విజయ క్రాంతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని, పేదలకు రూ5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ అన్నారు. గురువారం దమ్మపేట మండలంలోని మొండివర్రె గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ముందుగా బేతం రవి, నాగలక్ష్మి ఇంటికి ఆయన స్వయంగా భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విడతల వారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసే ప్రభుత్వం అన్నారు. ఇల్లు లేని పేదలు ఉండకూడదనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు పేదలకు ఇల్లు మంజూరు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈఈ సుబ్రహ్మణ్యం, ఏ ఈ ఈ రాము, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ పాల్గొన్నారు.