calender_icon.png 19 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోలే బాబాకు 100 కోట్ల ఆస్తులు

06-07-2024 12:37:29 AM

పలు రాష్ట్రాల్లో 24 ఆశ్రమాలు

లగ్జరీ కార్ల కోసం ప్రత్యేక గ్యారేజీ

ఆయన భార్యకు విలాసవంతమైన ఆరు గదులు

ఎటైనా వెళ్లాలంటే భారీ వ్యక్తిగత భద్రత

హత్రాస్ (యూపీ), జూలై 5:  భోలే బాబా సత్సంగ్ తొక్కిసలాటలో 121 మంది మరణించిన తర్వాత ఆయన గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలేబాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నప్పటికీ దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. కానీ, ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని వెల్లడించారు.

భోలే బాబాకు దేశ వ్యా ప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని విశ్వసనీ య వర్గాలు తెలిపాయి. వీటిలో అత్య ధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీనారాయణ్ హరి సాకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్విహిస్తున్నారు. ఆయన భక్తులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు. తెలుపు రంగు టయెటా ఫార్చునర్‌లో ఆయన ప్రయాణిస్తారు. కారుతో సహా ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుంది. 

విలాస జీవితం

భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మెయిన్‌పురిలోని బిచ్వాలో కోట్ల విలువైన ప్రవాస ఆశ్రమాన్ని అలీగఢ్ జీటీ రహదారిపై 13 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ భవనంలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు, విలాసవంతమైన బాబా కార్ల శ్రేణి కోసం భారీ గ్యారేజీ ఉంది. కాన్పూర్ ఆశ్రమంలో ఆయన భార్య కోసం దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. తన ఆశ్రమంలో ద్వారం వద్ద తనకు భారీగా విరాళాలు ఇచ్చిన 200 మంది దాతల జాబితాను కూడా ఉంచారు. షాజహాన్‌పూర్, ఆగ్రా ప్రాంతాల్లో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. 

హత్రాస్ బాధితుల వద్దకు రాహుల్

హత్రాస్ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఆరుగురు నిర్వాహకులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అందరూ భోలేబాబా ప్రత్యేక ఆర్మీ సేవాదర్స్ కావడం గమనార్హం. శుక్రవారం రాహుల్ గాంధీ హత్రాస్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరా మర్శించారు. తొక్కిసలాటలో గాయపడిన పేద కుటుంబాలకు వీలైనంత ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగిని అభ్యర్థించారు. 

భోలే బాబా ఎక్కడ? 

ఘటనకు కారణం అయిన భోలే బాబా మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. ఘట న మీద విచారణ చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడి న జ్యుడిషియల్ కమిషన్‌ను నియమించింది.