కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ప్రజలు బోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మణుగూరు సబ్ డివిజన్ తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో భోగిమంటలను వేశారు. మణుగూరులోని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటల వేడుకల్లో ఎమ్మెల్యే పాయం, సతీమణి మాజీ ఎంపీపీ పాయం ప్రమీల, కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి ఖాయం మాట్లాడుతూ.. భోగి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ భోగి పండుగ నాటు నుంచి అష్ట ఐశ్వర్యాలు.. సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.